రోడ్డు ప్రమాదంలో గేదెల కాపరి బి. వరలక్ష్మి (59) శుక్రవారం దుర్మరణం చెందింది. సాతులూరు వద్ద ట్యాంకర్ లారీ ఢీకొని దుర్మరణం చెందారు. దూడ మృత్యువాత పడగా, మరో గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతదేహం గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.