ఎడ్ల పందేల నిర్వహణపై గతంలో కొందరు స్వార్థంతో కోర్టుల్లో పిటిషన్లు వేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం రాత్రి నాదెండ్ల మండలంలో ఒంగోలు జాతి ఎడ్ల జాతీయస్థాయి బండలాగుడు పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనరాష్ట్రానికే గర్వకారణమైన ఒంగోలు జాతిని రైతులు పరిరక్షించాలని పుల్లారావు పిలుపునిచ్చారు.