చిలకులూరిపేట మండలం కావూరు గ్రామంలో బుధవారం జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పరిశీలించారు. కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైనా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.