చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలోని పద్మనాభునిపేటలో గోలి సులోచన అనే మహిళ ఇంటి ఆవరణలోని తులసి చెట్టు మీద శనివారం ఉదయం ఓ శ్వేత నాగు ప్రత్యక్షమైంది. దీంతో ఇది నాగదేవత మహిమ అంటూ ప్రచారం సాగింది. ఈ విషయం ఆ నోట ఈనోటా పోకడంతో పాము వున్న ఇంటి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలి పాముకి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.