చీరాల మండలం, దేవాంగపురి నందు సునీత వీవర్స్ అధినేత, సీనియర్ టీడీపీ నాయకులు సిద్ది బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో అల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా సిద్ధి బుచేశ్వర రావు మాట్లాడుతూ మన కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం చేనేతలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాల కొండయ్య సహకారంతో చేనేతలకు వివిధ పధకాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.