క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. చీరాల ఎన్.ఆర్.పి.ఎం. మున్సిపల్ హైస్కూల్ మైదానంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. క్రీడలు యువతలో స్పూర్తిని పెంచి, జీవితంలో రాణించేందుకు సహాయపడతాయని తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించనున్నట్టు భరోసా ఇచ్చారు.