చీరాల నియోజకవర్గ పరిధిలో
బీజేపీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్
బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల రమణ రావు, అరవపల్లి కుమార్, జిల్లా కార్యదర్శి, నాసిక శివాజీ, శంకరశెట్టి నాగేశ్వరరావు, నాశన మణికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.