చీరాల పట్టణంలోని పలు హోటల్స్, స్వీట్స్ దుకాణాల ఖార్కానాలను జిల్లా ఆహార భద్రతాధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా హోటల్స్ లో తినుబండారాల తయారీకి వినియోగించే పప్పుదినుసుల శాంపిల్స్ ను వారు సేకరించి ల్యాబ్ కు పంపారు. లైసెన్సు లేకుండా నడుస్తున్న జానకి టిఫిన్ సెంటర్ కు నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించుకుంటే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి జి. ప్రభాకర్ హెచ్చరించారు.