రెండు తెలుగు రాష్ట్రాలలో రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. చీరాల మండలం పాత చీరాల గ్రామ శివారు ప్రాంతంలోని సూర్య భగవానుడి ఆలయానికి మంగళవారం తెల్లవారు జాము నుండే భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ లో బారులు తిరి స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని సూర్యప్రభ వాహనంపై పట్టణ పరిధిలో భక్తులు నగరోత్సవం నిర్వహించారు.