చీరాల: పొగమంచు దెబ్బకు జిటి ఎక్స్‌ప్రెస్ 13 గంటలు ఆలస్యం

80చూసినవారు
న్యూఢిల్లీ నుండి చెన్నై ఎగ్మోర్ కు వెళ్లే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (12616) రైలు ఆదివారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. శనివారం రాత్రి 10:44కి చీరాల, 11.29కి ఒంగోలు రావాల్సిన ఈ రైలు ఏకంగా 13 గంటల పైన ఆలస్యంగా నడిచింది. ఆదివారం ఉదయం 11:50కి ఈ రైలు చీరాల చేరుకుంది. ఈ రైలులో ఒంగోలు, నెల్లూరు, గూడూరు ప్రయాణించే రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పొగ మంచు కారణంగా రైలు ఆలస్యమైనట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్