చీరాల: ఒకే కార్యక్రమంలో కొండయ్య, బలరాంలు

70చూసినవారు
చీరాల: ఒకే కార్యక్రమంలో కొండయ్య, బలరాంలు
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంలు శనివారం రాత్రి ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ ఆ ఇద్దరూ ఆనందంగా సంభాషించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ ని కొండయ్య చీరాలలో ఓడించారు. కాగా చీరాలలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి కలయిక హాట్ టాపిక్ అయింది.

సంబంధిత పోస్ట్