పెట్టుబడిదారుల లబ్ధి కోసమే మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నారని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ నుండి గడియార స్థంభం సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా వసంతరావు మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ల ముఖ్య ఉద్దేశమన్నారు.