చీరాల మండలం పాత చీరాల గ్రామంలో కొలువుదిరిన సూర్య భగవాన్ ఆలయంలో మంగళవారం రథసప్తమి ఘనంగా జరిగాయి. సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య రథసప్తమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సూర్య భగవానున్ని దర్శించుకున్నారు.