తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట సి. ఐ. టి. యు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ సర్వీస్ ను బట్టి కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.