చీరాల పట్టణంలో విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని మంగళవారం మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేవలం కౌన్సిల్ ఆమోదం మాత్రమే జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో విగ్రహ కమిటీ ఉంటుందన్నారు. అయితే ఆ కమిటీ నుంచి ఎవరికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కమిషనర్ అన్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు నిర్మించాలని చూస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.