వేటపాలెం మండలం, రామన్న పేట పరిధిలోనీ వినాయక పురంలో ఎన్ టి ఆర్ ఫిష్ మార్కెట్ ను చీరాల శాసనసభ్యులుు మద్దులూరు మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటపాలెం మండల అభివృద్ధికీ సంబంధించిన పనులకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు వోలుకుల కోటయ్య, మాజీ సర్పంచ్ నాసిక వీరభద్రయ్య , బూత్ కన్వీనర్ గుత్తి కుమార్ బాబు, ఒలుకుల అయ్యప్ప ఉన్నారు.