విద్యార్థిలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ పి.రవికుమార్ అన్నారు. చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నప్పుడే వారు అభ్యసించిన విద్యకు సార్ధకత లభిస్తుందన్నారు. ఇదే తరహాలో విద్యతోపాటు ఉపాధి అవకాశాలు అందించే దిశగా కళాశాల కృషి చేస్తుందని వెల్లడించారు.