ఇళ్లులేని పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్ అన్నారు. మంగళవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మంజూరు చేయాలని అన్నారు.