చీరాల: జాయింట్ కలెక్టర్ పై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

81చూసినవారు
చీరాలలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పై మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు సంచలన ఆరోపణలు చేశారు. జాయింట్ కలెక్టర్ టిడిపి ప్రభుత్వానికి కాకుండా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. పిలవని పేరంటానికి జెసి చీరాల వచ్చి ఈ విషయాన్ని మరింత క్లిష్టతరం చేశారన్నారు. తాను అన్నిటికీ సిద్ధమని పాలేటి చెప్పారు.

సంబంధిత పోస్ట్