రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు) రూపొందించిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ను శనివారం చీరాల నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలకు ఆ సంఘం నాయకులు వి ప్రభాకర్ రావు, ఎం ఏసురత్నం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టడీ మెటీరియల్ ను రాష్ట్ర వ్యాప్తంగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సామూహిక నైపుణ్యము, బోధన అనుభవాన్ని క్రోడీకరించి రూపొందించినట్లు తెలిపారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు.