చీరాల: రీసర్వేతో పారదర్శకమైన సేవలు

74చూసినవారు
చీరాల: రీసర్వేతో పారదర్శకమైన సేవలు
భూముల రీ-సర్వేతో రైతులకు పారదర్శకమైన సేవలు అందించాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అన్నా రు. కొంతకాలంగా చీరాల మండల పరిధిలోని చీరాల నగర్‌ గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమంలో తహసీల్దార్‌ గోపీకృష్ణతో కలిసి ఆర్డీవో పర్యవేక్షించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడారు. కొలతలలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్