నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 10వ కమాండెంట్ వి. వి. ఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు స్థానిక పేరాల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ నందు విపత్తు నిర్వహణపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులుగా మన బాధ్యతలను గుర్తుంచుకోవాలన్నారు. విపత్తు సమయంలో దగ్గర ఉంచుకోవలసిన వస్తువుల కిట్ ను పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో టీం కమాండర్ ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్, మద్దినేని జగదీష్ తదితరులు ఉన్నారు.