చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సిబ్బంది బుధవారం మధ్యాహ్నం చిన్నగంజాం మండలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ తరుణంలోనే సంతరావూరు గ్రామంలో ప్రభుత్వ అనుమతికి మించి అధికంగా మద్యం సీసాలు కలిగి ఉన్న ఓ మహిళ పట్టుబడింది. ఆమె నుండి 18 మద్యం సీసాలను స్వాధీనపరచుకున్నారు. ముద్దాయిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ నాగేశ్వరరావు తెలిపారు.