చినగంజాం మండలం మున్నం వారి పాలెంలో సోమవారం టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని టిడిపి వర్గీయులు పొలం పనులకు వెళుతున్న తమ పై దాడికి పాల్పడినట్లు వైసిపి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ దాడిలో ఇద్దరు వైసిపి వర్గీయులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.