చీరాల గడియార స్తంభం సెంటర్లో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. నిన్న వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి పాలేటి రామారావు గడియార స్తంభం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడంపై మంగళవారం కూటమి నేతలు అభ్యంతరం తెలిపారు. పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి పాలేటితో పాటు వైసిపి నాయకుల చిత్రపటాలను చించి వేశారు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తే సహించేది లేదని చంద్రబాబును ఇష్టానుసారంగా దుర్భాషలాడిన వైసిపి నాయకులు నేడు ఎన్టీఆర్ పూలమాలలు వేసి దండాలు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.