చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో సోమవారం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, టిడిపి నేత డాక్టర్ పాలేటి రామారావు ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తమకు ముందస్తు సమాచారం లేకుండా భూమి పూజ చేయడం ఏంటని ఆయనను పోలీసులు ప్రశ్నించారు. తమ వద్ద కౌన్సిల్ ఆమోదం తెలిపిన పత్రాలు ఉన్నాయంటూ పోలీసులకు మాజీ మంత్రి పాలేటి వివరించగా వారు వెనుతిరిగారు.