వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నం సిలోన్ కాలనీలో సీనియర్ పాత్రికేయులు కొల్లిమర్ల సాంబశివరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చీరాల రోటరీ క్లబ్ సభ్యులు మృతుడి కుటుంబానికి రూ.13వేలు ఆర్థిక సహాయం చేశారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు రోటరీ క్లబ్ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, మామిడాల శ్రీనివాసరావు, జివై ప్రసాద్, దోగుపర్తి వెంకట సురేష్ పాల్గొన్నారు.