రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేశాకే లేఅవుట్లు వేసుకోవాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన వేటపాలెం మండలం అక్కాయ్యపాలెంలో ల్యాండ్ కన్వర్షన్ కోసం వచ్చిన అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. అక్రమ లేఅవుట్లను ఏరిపారేస్తామని హెచ్చరించారు. తహశీల్దార్ పార్వతి కూడా పాల్గొన్నారు.