వేటపాలెం మండలం వివేకానంద కాలనీలో నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పది లీటర్ల నాటు సారా స్వాధీనపరుచుకున్నారు. పోలీసులను చూసి పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. నాటు సారా తయారీ, అమ్మకాలు నిషిద్ధమని, ఈ నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.