వేటపాలెం: మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

74చూసినవారు
వేటపాలెం: మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు బైపాస్ రోడ్డులో పట్టుకున్నారు. ఇసుక తరలింపునకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీటిలో ఒక ట్రాక్టర్ అక్కయ్యపాలెంకు చెందినది కాగా మరో రెండు ట్రాక్టర్లు చల్లారెడ్డిపాలెంకు చెందినవని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్