అధిక వేగంతో వెళుతున్న బైక్ అదుపు తప్పడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో జరిగింది. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్సులో క్షతగాత్రుడుని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.