మేడికొండూరు మండలంలోని సిరిపురం గ్రామంలో శనివారం "స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యత, మురిగినీటి నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నివారణ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.