చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన 'ఎమ్మెల్సీ ఎన్నికలు-ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్ర' సమావేశంలో ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడారు. బూత్ ఇన్‌ఛార్జ్‌లు, ఓటర్ల సమన్వయకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను ఎవరు ఇబ్బంది పెట్టినా సహించబోమని, వారికి అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.