గుంటూరు నగరంలోని గోరంట్ల వాటర్ స్కీమ్‌కు అమృత్ 2. 0 కింద రూ. 362. 23 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో రూ. 331. 10 కోట్లు పైప్‌లైన్ ఏర్పాటుకు, రూ. 32. 13 కోట్లు నీటి సరఫరా కోసం కేటాయించారు. కృష్ణా నది నుంచి నీటిని తీసుకొని గోరంట్ల ప్రాంతానికి సరఫరా చేసే మెకానిజం ఏర్పాటు చేయనున్నారు. నగర అభివృద్ధిపై కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.