కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మాధవి, మహ్మద్ నసీర్, ఆనందబాబు పాల్గొన్నారు.