గుంటూరు నగరంలో కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం స్పష్టం చేశారు. మెయిన్ రోడ్లపై చెట్లు, హోర్డింగ్స్ తొలగింపు, నీటి నిల్వల తొలగింపుపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ ఇంజిన్లు వినియోగించాలని తెలిపారు. త్రాగునీటి సరఫరా ఎక్కడా నిలిపిపోకూడదని, మేజర్ డ్రైన్ల వద్ద వ్యర్థాలు తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.