గుంటూరు: ఇంటి స్థలాల కోసం ఈనెల 19న సీపీఐ ధర్నా

82చూసినవారు
గుంటూరు: ఇంటి స్థలాల కోసం ఈనెల 19న సీపీఐ ధర్నా
పేదల సొంతింటి కలను సాకారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 5 సెంట్లు, పట్టణాల్లో 3సెంట్ల భూమి కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసహాయం అందించాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్