గుంటూరు పట్టణంలో శనివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో నెలకొన్న సమస్యల గురించి ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.