గుంటూరు జీజీహెచ్ లో ఉన్న సమస్యల పరిష్కారం నిమిత్తం ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, బి. రామాంజనేయులుతో కలిసి శనివారం కేంద్ర గ్రామీణఅభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నాట్కో సెమినార్ హాలులో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అదనంగా మరో 60ఏసీలు కావాలని వైద్యులు కోరారు. వీల్ చైర్స్, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ను కూడా ఏర్పాటుచేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.