సీపీఐ శతజయంతి ఉత్సవాల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధమవ్వాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు శనివారం పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మహాసభలు నిర్వహించాలన్నారు. సామాజిక న్యాయం, ప్రజా హిత సాధనకు పార్టీ ముందుండాలని సూచించారు.