గుంటూరు జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు గత నెల 13న ఎన్నికల నిర్వహించారు. అయితే ఈసారి అసెంబ్లీ స్థానాలకు హోరాహోరి పోటీ జరగనుంది. అభ్యర్థులకు భారీ మెజారిటీలు కనిపించే పరిస్థితిలో లేవు అని ఆయా పార్టీల నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు విజయం పై
వైసీపీ, కూటమి నాయకులకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపటి ఎన్నికల లెక్కింపుతో ఉత్కంఠకు తెరపడనున్నది.