కొల్లిపర: ఉర్దూ పాఠశాలను విలీనం చేయవద్దని వినతి

70చూసినవారు
కొల్లిపర: ఉర్దూ పాఠశాలను విలీనం చేయవద్దని వినతి
కొల్లిపరలో ఉర్దూ పాఠశాలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయవద్దని ముస్లిం పెద్దలు కోరారు. ఈ మేరకు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి సల్మాన్ రాజుకు వినతిపత్రం అందజేశారు. 1963లో స్థాపించిన ఈ ఉర్దూ పాఠశాల నేటికీ విజయవంతంగా నడుస్తుందని పాఠశాలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయవద్దని కోరారు. అలాగే మున్నంగిలోని రెగ్యులర్ పాఠశాలను ఎల్ఈ పాఠశాలలో కలపవద్దని ఎంపీడీవో విజయలక్ష్మిని గ్రామస్తులు కలిసి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్