నకరికల్లు మండలం, గుండ్లపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గుండ్లపల్లి ఇటుక బట్టి వద్ద శనివారం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ కొలిమి బడే సాహెబ్ (భాషా) 65 ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా మాచర్ల వెళ్ళే పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుక వైపు నుంచి ఢీకొన్నది. దీంతో భాషా తలకు తీవ్రమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు.