గుంటూరులో ఎన్డీఏ తిరంగా యాత్ర

59చూసినవారు
గుంటూరులో ఎన్డీఏ  తిరంగా యాత్ర
భారత త్రివిధ దళాల ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా శనివారం గుంటూరు నగరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. హిందూ కాలేజీ జంక్షన్ నుండి లాడ్జి సెంటర్ వరకు సాగిన ఈ యాత్రలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో గుంటూరు నగరం మార్మోగింది.

సంబంధిత పోస్ట్