రేపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నగరంపాలెం రమేష్ హాస్పిటల్ వద్దనున్న ఈద్గా, పాత బస్టాండ్ ఉర్దూ హైస్కూల్ ఈద్గా, పొన్నూరు రోడ్ లోనున్న ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రార్ధనా ప్రాంగణాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.