ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగాభవాని రూ.34 లక్షలు స్కామ్ కు పాల్పడిందనే విషయం తెలియగానే కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ హాల్ లో అడగడం జరిగిందని చిలకలూరిపేట ఛైర్మన్ రఫాని అన్నారు. శనివారం ఛాంబర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్కామ్ పై అధికారులు పూర్తిగా ఎంక్వయిరీ చేయాలని గతంలో చెప్పానన్నారు. ఈ స్కామ్ లో తన పాత్ర లేదనన్నారు. దీని ద్యారా 10మంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారన్నారు.