నరసరావుపేట నవోదయ నగర్‌కు చెందిన ప్రవీణ్, హరీష్ వారి కారు మూడు రోజుల క్రితం అపహరణకు గురైంది. బాడుగకు తీసుకెళ్లిన డ్రైవర్ శివ డూప్లికేట్ తాళం తయారు చేసి కారును చోరీ చేశాడు. నెంబర్ మార్చి పేరేచర్లలో దాచిపెట్టాడు. నరసరావుపేట 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్ పర్యవేక్షణలో పోలీసులు ఆదివారం కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.