రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం ఆదివారం గుంటూరులో నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు తూబాటి శ్రీను మాట్లాడుతూ, సమిష్టి కృషితో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి పాలపర్తి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు లక్ష్మినాయక్, కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.