అన్నమయ్య జిల్లాలో ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థి రంగ సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని నిలదీశారు.