రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో బుధవారం ఏర్పాటు చేసిన కూటమి నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నాయకులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం జెండా ఎగరవేయవచ్చని తెలిపారు.